త్వరలో కుమార్తె వివాహం.. అంతలోనే విషాదం.!

త్వరలో కుమార్తె వివాహం.. అంతలోనే విషాదం.!

RR: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యాచారం మండలం నజ్దిక్ సింగారంలో కుమార్తె వివాహానికి ఓ రైతు అన్ని సిద్ధం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన అంజయ్య తన ఆఖరి కుమార్తె వివాహం నిశ్చయమై, త్వరలో జరగాల్సి ఉంది. అయితే నిన్న పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.