అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే సుగంధ ద్రవ్యల చీర అందజేత

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు మంగళవారం అగ్గిపెట్టలే ఇమిడే సుగంధ ద్రవ్యాల చీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక చీరను ఈవో రాధాబాయికి అందజేసి అమ్మవారికి సమర్పించారు. ఈ చీర పొడవు: 5.5 మీటర్లు, వెడల్పు: 48 ఇంచులు, బరువు: 250 గ్రాములు ఉందని కళాకారుడు విజయ్ తెలిపారు.