సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

అన్నమయ్య:  సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాజంపేట రూరల్ సీఐ ప్రసాద్ బాబు అన్నారు. శనివారం రాజంపేట మండలం బోయినపల్లిలోని SJSM జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాలకు గురి కాకుండా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.