అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?
అమెరికాలో పుట్టిన వారందరికీ పౌరసత్వం ఇవ్వకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. గతంలో స్థానిక అమెరికన్ ఇండియన్ తెగలకు పౌరసత్వం ఇవ్వలేదని, అదే రూల్ ఇప్పుడు వలసదారులకు వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు. అయితే, ఈ పాత నిబంధనను వలసదారులకు అన్వయించలేమని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. ఈ కీలక అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అమెరికా పౌరసత్వ భవిష్యత్‌ను తేల్చనుంది.