ఆవులను రక్షించిన పోలీసులు

WGL: భద్రకాళినగర్‌లో గోవధకు ఆవులను అక్రమంగా ఉంచడంపై విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, మామూనూర్ పోలీసులు చేరుకొని షెడ్డులో అక్రమంగా ఉంచిన 5 ఆవులు, దూడను గుర్తించారు. వెంటనే వాటిని సంరక్షించి గోశాలకు తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ తదితరులున్నారు.