మిర్యాలగూడ డీఎస్పీ బదిలీ
NLG: మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా నూతన డీఎస్పీగా ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. గత రెండేళ్లుగా శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు చేపట్టి దమ్మున్న పోలీసు ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు.