హైదరాబాద్‌లో హైఅలర్ట్.. విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌లో హైఅలర్ట్.. విస్తృత తనిఖీలు

TG: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మతపరమైన, పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లోనూ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.