అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
GDWL: గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరెల్లి వీధిలో బలిజ లక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. భర్త మల్లికార్జున్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఫర్టిలైజర్ దుకాణం నడుపుతున్నాడు. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు కనిపించలేదు అన్నారు. గద్వాల సీఐ శ్రీను, టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్, శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.