VIDEO: కంచెకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
ప్రకాశం: రాచర్ల మండలంలోని కాల్వపల్లి సమీపంలో మొక్కజొన్న, మామిడి తోట కంచెకు బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.