విద్యార్థులకు నాసా కిట్లు పంపిణీ
SS: హిందూపురంలోని పాఠశాలలో 17 మంది విద్యార్థులు నాసా కాంటెస్ట్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేష్ కుమార్ విద్యార్థులను బుధవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో వైజ్ఞానిక, శాస్త్ర విభాగములో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నాసాకిట్లను పంపిణీ చేశారు.