గూడూరు సీహెచ్సీకి డయాలసిస్ సెంటర్ మంజూరు

గూడూరు సీహెచ్సీకి డయాలసిస్ సెంటర్ మంజూరు

MHBD: గూడూరు సీహెచ్సీకి ఐదు యూనిట్లతో డయాలసిస్ సెంటర్ మంజూరైందని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ గురువారం ఓ ప్రక టనలో తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అదనంగా రెండు డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహా, సీఎం రేవంత్ రెడ్డిని కోరగా వారు యూనిట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసినందుకు వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.