నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి

నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి

MNCL: నెన్నెల మండలంలోని కోనంపేట శివారు చిన్నవాగులో నీటి గుంతలో పడి డోలో బక్కయ్య(63) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నీటిగుంతలో విగత జీవిగా ఉన్న బక్కయ్యను చూసిన యువకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు జారి నీటిగుంతలో పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.