‘నెహ్రూ పెట్టిన రూల్స్ కాంగ్రెస్‌కే తెలీదా?’

‘నెహ్రూ పెట్టిన రూల్స్ కాంగ్రెస్‌కే తెలీదా?’

75 ఏళ్ల పార్లమెంట్ చరిత్రను విపక్షాలు కించపరిచాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. నెహ్రూ నిర్దేశించిన నిబంధనలను కాంగ్రెస్ ఎంపీలు ఉల్లంఘించడం సిగ్గుచేటని విమర్శించారు. స్పీకర్‌కు రాజకీయాలతో సంబంధం లేదని, ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించడం తగదని స్పష్టం చేశారు.