స్వామిని దర్శనం చేసుకున్న జగిత్యాల కలెక్టర్

కృష్ణా: జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ దంపతులతో కలిసి మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు శ్రీరామ వరప్రసాదరావు సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్ తొలుత నాగపుటలో పాలు పోసి పూజలు నిర్వహించారు.