తీవ్ర స్థాయిలో రోడ్లపై పేరుకుపొయిన చెత్త
VZM: గణపతినగరం మండలం పురిటిపెంట పంచాయితీలో తీవ్ర స్థాయిలో చెత్త రోడ్డువెంట పడివెస్తున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. దీంతో గ్రామంలో చాలా మంది ఆరోగ్య సమస్యలకు గురైతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.