రాప్తాడులో ఎన్టీఆర్-రవీంద్ర విగ్రహాలు: సునీత
AP: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థల పరిశీలన చేశారు. నియోజకవర్గానికి వారి సేవలను గుర్తించి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాయకులు సూచించారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని సునీత తెలిపారు.