నరాలశెట్టివారిపాలెంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
బాపట్ల జిల్లా నరాలశెట్టివారిపాలెంలోని నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, కనులపండువగా జరిగింది. గత మూడు రోజులుగా శాస్త్రోక్తంగా సాగుతున్న పంచాహ్నిక దీక్షా కార్యక్రమాలు విగ్రహ, శిఖర ప్రతిష్ఠతో వైభవంగా ముగిశాయి. అనంతరం ఆలయంలో కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.