పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు

పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు

MBNR: ఈనెల 16న మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రానున్నట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.