బ్రాహ్మణ చెరువులో చిన్నారులు, గర్భిణులకు టీకాలు..!
W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామ సచివాలయంలో బుధవారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు, చిన్నారులకు ఏఎన్ఎం లక్ష్మీ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. శిశువుల ఆరోగ్య పరిరక్షణకు టీకాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్ నాగభూషణం, ఆశా వర్కర్లు పాల్గొని టీకాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.