'అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి'

NRML: భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ప్రాజెక్టు అధికారులు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.