BSP పార్టీ కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని వినతి

NGKL: జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం కోసం కొంత స్థలం కేటాయించి ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ అన్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, అసెంబ్లీ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.