పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ

WGL: జిల్లా, వరంగల్ (వెస్ట్) లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత ఇవాళ పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రజలతో వ్యవహరించే తీరు, మహిళా-పిల్లల ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఆమె సమీక్షించారు. నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిబ్బంది మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.