ఉపాధి హామీ సామాజిక తనిఖీ.. రూ.64.072 రికవరీకి ఆదేశాలు
SRD: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై అందోల్ మండల ఎంపిఓ కార్యక్రమంలో మండల ప్రజావేదిక నిర్వహించారు. అదనపు పీడీ బాలరాజు ఆధ్వర్యంలో సోమవారం 15వ విడత సామాజిక తనిఖీలు చేపట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో రూ.64.072 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యాలయంలో విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు, ఎంపిడిఓ రాజేష్ ఉన్నారు.