హిందూ సమ్మేళనానికి ప్రచారం ముమ్మరం
RR: నందిగామ మండలం చేగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 25న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెంకమ్మగూడ గ్రామంలో హిందూ సమ్మేళన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామస్తులు, యువకులు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. గ్రామంలో వాల్ పోస్టర్లను అంటిస్తూ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.