అంగన్వాడి భవన నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన దాత
NRPT: గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి గ్రామానికి చెందిన గజ్జలి నందకేశ్వర్ గౌడ్ తన సొంత భూమిని విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. పుట్టి పెరిగిన ఊరు కోసం ఏదైనా చేయాలన్న తపనతో భూమిని విరాళంగా ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా మహిళలు చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు.