ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్యలోని రామ మందిరం ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతుంది. ఈ నెల 25న జరగనున్న ఈ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు PM మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. తిరిగి 26న ఉ.7 గంటలకు ప్రారంభిస్తామని చెప్పింది.