'పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
JGL: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి గ్రామానికి చెందిన గుర్రం మధు- పావని దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీరను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వహీద్, ఎంపీడీఓ సలీం పాల్గొన్నారు.