VIDEO: రాయచోటి వద్దు–కడప ముద్దు రైతు ఆవేదన
KDP: సిద్ధవటం ప్రాంత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, రాయచోటిని కాదని కడపను తమ పరిపాలనా కేంద్రంగా చేయాలని నినదించారు. వ్యవసాయం, పంటలు, రవాణా సౌకర్యాల దృష్ట్యా కడప సమీపంలోనే పనులు, పరిపాలనా వ్యవహారాలు జరగాలని వారు డిమాండ్ చేశారు. రాయచోటి దూరమవడం వల్ల పంటల సమస్యలు, మార్కెట్ చేరువ, ప్రభుత్వ కార్యాలయాల పనులు రైతులకు ప్రతిరోజూ భారంగా మారుతున్నాయని తెలిపారు.