పోలీసుల ప్రజా చైతన్య కార్యక్రమం
ASR: ముంచంగిపుట్టులో పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు ఎస్సై నాని స్థానిక కూడలిలో ప్రజలకు చైతన్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నిబంధనలు, గంజాయి, నాటు సారా వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల నివారణ, మహిళా రక్షణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.