PACS ఛైర్మన్‌గా సుంకర రాజేష్

కృష్ణా: ఉంగుటూరు మండలం పోనుకుమాడు పీఎసీఎస్ నూతన ఛైర్మన్‌గా సుంకర రాజేష్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా 110 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని రాజేష్ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. గన్నవరం టీడీపీ నాయకుడు కాసర్నేని రాజా చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.