ఓట్ల కోసం స్వగ్రామాలకు ప్రజలు.. రద్దీగా RTC బస్సులు
WGL: స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు స్వగ్రామాల వైపు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. దీంతో బుధవారం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఆర్టీసీ బస్సుల్లో తీవ్ర రద్దీ కనిపిస్తోంది. ప్రయాణికులు బస్సులపై వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రవాణా శాఖ అదనపు బస్సులను నడిపించాలని వారు కోరుతున్నారు.