బుక్కపట్నం విద్యార్థి సౌత్ జోన్ వాలీబాల్‌కు ఎంపిక

బుక్కపట్నం విద్యార్థి సౌత్ జోన్ వాలీబాల్‌కు ఎంపిక

సత్యసాయి: బుక్కపట్నంలోని శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న మురళీకృష్ణ సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఎస్కే యూనివర్సిటీ అనంతపురం తరఫున నిర్వహించిన గ్రూప్ 'బి' టోర్నమెంట్‌లో ప్రతిభ చూపాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఎస్ మక్బూల్ హుస్సేన్ తెలిపారు. మురళీకృష్ణను అధ్యాపకులు అభినందించారు.