VIDEO: మొరాయించిన ఆర్టీసీ బస్సు.. నెట్టిన ప్రయాణికులు
కోనసీమ: కాట్రేనికోన గేట్ సెంటర్ వద్ద ఇవాళ చిర్రయానం నుంచి అమలాపురం వెళ్లే ఆర్టీసీ బస్సు మొరాయించింది. అదే సమయంలో వైసీపీ ధర్నా కొనసాగుతుండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు కలిసి బస్సును నెట్టారు. ఎట్టకేలకు బస్సు స్టార్ట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.