మూడు దశాబ్దాల తర్వాత ఆర్టీసీ బస్సు
CTR: గుడిపాల మండలంలోని అడవిచేను గ్రామానికి మూడు దశాబ్దాల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. ఇందులో భాగంగా మండలంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పర్యటనలో భాగంగా చిత్తూరు - అడవిచేను ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో పూజ చేసి ప్రారంభించారు. దీంతో పాటు బొమ్మసముద్రం క్రాస్‌లో గొల్లమడుగు, పానాటూరు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించారు.