న్యాయం చేయాలని మాజీ సైనికుల నిరసన

NLG: దేవరకొండకు చెందిన సముద్రాల కృష్ణయ్య దేశం కోసం పోరాడే జవానుల సేవలను గుర్తించి తనవంతుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో 40 మంది కుటుంబాలకు స్థలాన్ని దానం చేసి అప్పట్లో అందించారు. కానీ కొంతమంది వారిదే భూమి అంటూ ఇబ్బంది పెడుతున్నారని మాజీ సైనికులు ఆరోపించారు. సంబంధిత అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగడంలేదని స్థానిక ఐబి వద్ద ఇవాళ నిరసన తెలిపారు.