VIDEO: పొన్నూరులో డివైడర్‌ను ఢీకొన్న కారు
GNTR: పొన్నూరులోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం ప్రమాదం తప్పింది. జీబీసీ రోడ్డులో వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.