ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
NRPT: మద్దూర్ మండలం ఖాజీపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ, సర్పంచ్ సాయప్ప గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.