టేయిల్ పాండ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

టేయిల్ పాండ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

నల్గొండ: అడవిదేవులపల్లి మండలంలోని టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతమైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి 3,35,883 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్లు 4 అడుగుల మేర పైకెత్తి 3,31,680 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 75.50 అడుగులు ఉంది.