'సెల్ టవర్ అనుమతులు రద్దు చేయాలి'

'సెల్ టవర్ అనుమతులు రద్దు చేయాలి'

RR: హయత్‌నగర్ డివిజన్‌లోని సీతారాంపూర్ కాలనీవాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొందరు వ్యక్తులు సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్‌వోసీ లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ అనుమతులను అధికారులు రద్దు చేయాలని, జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేపట్టడం సరైనది కాదన్నారు.