'కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'

KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.