VIDEO: పంటసాగుకు నీరు లేక రైతుల ఆందోళన
WGL: సాగునీరు అందకపోవడంతో గుగులోత్ తండా గ్రామ రైతులు పొలాలు ఎండిపోతున్నాయని శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తీగరాజుపల్లి నుంచి మహబూబాబాద్ వరకు వెళ్లే ఎస్సారెస్పీ కాలువ నీరు పర్వతగిరి మండలం ఏనుగల్లు వైపు సరిగా చేరడం లేదని వాపోయారు. ఎస్సారెస్పీ అధికారులు నీటిని సక్రమంగా పంపిణీ చేసి, పొలాలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.