తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే గీత కార్మికుడు నల్ల మాస శంకరయ్య (58) రోజు మాదిరిగా తాటి చెట్టు ఎక్కి కల్లు గీసేవాడు. ఇదే క్రమంలో తాటిచెట్టు ఎక్కి గీస్తుండగా తాటి చెట్టుపై నుండి జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు.