ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
AP: రాష్ట్రంలో ప్రకృతి వైద్య సేవల ఆస్పత్రికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీలో రూ.750 కోట్లతో అపెక్స్ యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. 40 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర సర్కార్‌కు కేంద్రం లేఖ రాసింది. 450 పడకలతో ప్రకృతి వైద్య సేవా కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ క్రమంలో కేంద్రానికి మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.