చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఇవాళ శివాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ తరి రామానుజం దీనిని ప్రారంభించారు. యువత ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, శివాజీ అసోసియేషన్ యువతకు ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.