ఇనుగుర్తి గ్రామపంచాయతీకి వైకుంఠ రథం వితరణ
MHBD: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆయన సోదరుడు వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణ- వెంకట నర్సమ్మల జ్ఞాపకార్థం రూ.12 లక్షలు విలువ చేసే వైకుంఠ రథాన్ని ఇనుగుర్తి గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ రథాన్ని బుధవారం సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, ఎస్సై కరుణాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు.