ఉరి వేసుకుని మహిళ మృతి
NRPT: మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లిలో దాసరి లావణ్య అనే మహిళ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణించడంతో ఆమె కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. నిన్న ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.