గొర్రెల స్కాం కేసులో జోరు పెంచిన ఈడీ
HYD: నగరంలోని గొర్రెల స్కాం కేసులో ఈడీ జోరు పెంచింది. గొర్రెలు కొనకుండానే కోట్లు కేటాయించారని ఏసీబీ దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్ 15న బాధితులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసి, ఆదేశించింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారులు అరెస్ట్ కాగా, మాజీ మంత్రి తలసానిపై కూడా కేసు నమోదైంది. కాగా, అధికారులు, బ్రోకర్లు వేల కోట్ల నిధులను మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి.