గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

NLR: ఇందుకూరుపేట మండల పరిధిలోని పల్లెపాడు గ్రామంలో ఉన్న పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కో-కన్వీనర్ నెల్లూరు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తొలుత కో-కన్వీనర్ నెల్లూరు రవీంద్రారెడ్డి, కమిటీ సభ్యులు గంపల మంజుల మహాత్మా గాంధీ విగ్రహానికి ఖాదీ వస్త్రం, నూలుమాల సమర్పించారు.