చందనాలంకరణలో చెంగాళమ్మ దర్శనం

చందనాలంకరణలో చెంగాళమ్మ దర్శనం

TPT: పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణ కిరీటంతో అలంకరించిన అమ్మవారి భక్తులను ఆకట్టుకోగా, ఆలయం ఉగాది వేడుకలతో సందడిగా మారింది. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.