'హమాలీలకు జీతాలు చెల్లించాలి'

'హమాలీలకు జీతాలు చెల్లించాలి'

ASR: జీకేవీధి గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు వెంటనే జీతాలు చెల్లించాలని పలువురు హమాలీలు డిమాండ్ చేశారు. సోమవారం సంస్థ గోడౌన్ వద్ద నిరసన తెలిపారు. జీసీసీలో పనిచేస్తున్న హమాలీలకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. దీంతో తమ కుటుంబాలు పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలన్నారు.